యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాం

సెల్‌ఫోన్‌లు వచ్చాక..మానవ సంబంధాలు పడిపోయాయి

avanthi srinivas
avanthi srinivas

అమరావతి: యువతకు నైపుణ్యాలు కల్పించి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం జరుగుతున్న యువజన సర్వీసుల శాఖ రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ..సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. యువతను చైతన్యపరిచెందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. టీవీలు, సెల్‌ఫోన్‌లు వచ్చిన తర్వాత మానవ సంబంధాలు చాలా వరకు పడిపోయాయన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాల సీఈవోలు హాజరయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/