ఏపీలో అన్ని చోట్లా పోటీ చేస్తాం: బీఎస్పీ

ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేస్తామని ప్రకటించింది బీఎస్పీ. ఈ మేరకు పార్టీ సమన్వయకర్త, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మీడియా తో మాట్లాడారు. బీఎస్పీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సందర్భంగా రాయలసీమలో ఆధిపత్య కులాల రాజకీయాలను ఎండగడతామని హెచ్చరించారు. నెల్లూరుతో పాటు రాయలసీమ వ్యాప్తంగా 40స్థానాల్లో ఒకే సామాజికవర్గం పోటీలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

శాసనసభకు పోటీచేసే 50 మంది అభ్యర్థులను ఇదివరకే ప్రకటించామని, ఇప్పుడు మరో 50 మంది అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటిస్తున్నట్టు తెలిపారు. అలాగే 25 పార్లమెంటు స్థానాలకుగాను ఇదివరలో 11 మంది అభ్యర్థులను ప్రకటించామని, ఇప్పుడు మరో ఐదుగురు అభ్యర్థులను ప్రకటిస్తున్నామన్నా రు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్దే ధ్యేయంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు బీఎస్పీ పోటీ చేస్తోందని చెప్పారు.