మేము ముందే హెచ్చరించాం

డబ్ల్యూహెచ్‌వో అథ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌

tredros adhanom
tredros adhanom

జెనివా: కరోనా వైరస్‌ విషయంపై తాము ముందుగానే ప్రపంచ దేశాలను హెచ్చరించామని, అపుడు మా మాట విని స్పందించి ఉంటే ఇపుడు ఇటువంటి పరిస్థితి ఉండేది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ అన్నారు. కరోనా వైరస్‌ గురించి జనవరి ముఫ్పైన మేము ప్రపంచదేశాలను హెచ్చరించామని. అపుడు ఆ హెచ్చరికలను గుర్తించిన దేశాలు తగు జాగ్రత్తలతో ఇపుడు మెరుగ్గా ఉన్నాయని, తమ సలహాలను పెడచెవిన పెట్టకుండా ఉంటే ఇపుడు ఇంత అనర్ధం జరిగి ఉండేది కాదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. జనవరి 30 నాటికి చైనా కాకుండా ఇతర దేశాలలో 82 కేసులు మాత్రమే ఉండగా ఒక్క మరణం కూడా సంభించలేదని అన్నారు. మేము ఆనాడే ఫైండ్‌, టెస్ట్‌, ఐసోలేట్‌ అండ్‌ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ అనికూడా సూచించామని, ఈ విధానాన్ని పాటించిన దేశాలు కరోనా విషయంలో మిగతా వాటి కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయని అన్నారు. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధులు ఆపివేసిన నేపథ్యంలో అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి,

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/