పచ్చదనానికి చిరునామాగా మార్చుదాం: అల్లు అర్జున్
పర్యావరణ దినోత్సవం సందర్భంగా పిలుపు

Hyderabad: ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ తన ఇంటి వద్ద మొక్కనాటారు. తాను మొక్క నాటి నీళ్లు పోస్తుండగా తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ మొక్కలు నాటి తనలాగే చేయాలని పిలుపునిచ్చారు. ”మొక్కలను నాటుతామని, పర్యావరణహిత అలవాట్లను స్వీకరిస్తామని ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం”అని కోరారు . ”మన భవిష్యత్తు తరాల కోసం మన భూమిని పచ్చదనానికి చిరునామాగా మార్చుదాం”’ అని పిలుపునిచ్చాడు. ప్రతి ఒక్కరూ ఈ చొరవ తీసుకోవాలని కోరారు . #GoGreenWithAA అంటూ బన్నీ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.