రాజసికమైన తపస్సు

ఆధ్యాత్మిక చింతన

Lord Krishna
Lord Krishna

శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణుడు సాత్విక, రాజసిక, తామసిక తపస్సులను గురించి వివరిస్తాడు.

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రి విధం నర్తైః
అఫలా కాంక్షి భిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే

పరమశ్రద్ధతో ఫలాకాంక్షలేని వారిచేత ఆచరింపబడినపుడు అది సాత్త్విక తపమని అంటారు.

సత్కార మాన పూజార్థం తపో దంభేన చైవయత్‌
క్రియతేతదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్‌

గొప్పకొరకు, గౌరవం కొరకు, పూజింపబడడం కొరకు దంబంతో చేయబడే తపం రాజసమంటారు.

అది నిశ్చితము, అస్థిరము. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఈ మాటలకు ఆదిశంకరులవారి భాష్యము ఎంతో బాగుంది. ఆయన ఇచ్చిన వివరణ చూద్దాం –

సత్కారం కొరకు, మానం కొరకు అంటే ఎదురైనపుడు లేచి నమస్కరించడం మొదలైనవి చేయించుకోవడం కొరకు, పూజింపబడడం కొరకు అంటే కాళ్లు కడగడం, భోజనం పెట్టడం మొదలైనవి చేయించుకోవడం కొరకు, వీటి కొరకు దంబంతో చేయబడే తపం రాజసమనబడుతుంది.

దాని ఫలితం అనిశ్చితం, అధ్రువం అంటే అస్థిరం. ఇక తామసిక తపస్సును గూర్చి శ్రీకృష్ణ భగవానుడేమంటారో భగవద్గీత పుటలను త్రిప్పి చూద్దాం రండి.

మూఢ గ్రాహేణాత్మనో యత్‌ పీడయా క్రియతే తపః
పరస్సోత్సాదనార్ధం వా తత్తామసముదాహృతమ్‌

శ్రద్ధాత్రయ విభాగయోం దీని అర్ధం మూఢ నిశ్చయంతో శరీరానికి పీడ కలిగిస్తూ ఇతరులకు కీడు చేయడం కొరకు చేసే తపాన్ని తామసమంటారు. భగవద్గీతలోని ఈ మూడు శ్లోకాలు తపస్సును గూర్చి చెబుతున్న శ్లోకాలు.

సాధారణంగా ‘తపస్సు అంటేనే అదొక సత్కార్యమని భావిస్తాము. దాన్ని చేసే వారు సజ్జనులని భావిస్తాం. తన శరీరానికి పీడ కలిగిస్తూ ఇతరులకు కీడు కలగాని తపస్సు చేసేవారున్నారట, అలాంటి తపస్సును తామసిక తప్పస్సు అంటారట

. దాన్ని తప్పక దుష్క్యార్యం క్రింద లెక్కించాల్సిందే. అలాగే ‘యజ్ఞం, ‘యాగం అంటూనే వాటిని సత్యార్యాల క్రింద లెక్కించాల్సిందే.

అలాగే ‘యజ్ఞం, యాగం అంటూనే వాటిని సత్కార్యాల కింద జమకడతాం. అలా చేయటం తప్పు. ఎవరి కీడునో కోరుతూ ఎవరూ యాగం చేయరు కదా! అని కొందరు అంటారు.

ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసినప్పుడు ఏదో ఒక అభ్యర్థి గెలుపు కోరి స్వామీజీలు యాగం చేస్తే మరొక అభ్యర్థి ఓడాలని కోరుకుంటూ యాగం చేసినట్లే కదా? అప్పుడది పరోక్షంగా ఒకరి కీడును కోరి చేసినదే కాబట్టి దుష్కార్యమే అవ్ఞతుంది.

అలాంటి యాగాలను, తపస్సులను చేస్తున్న వారు వాటిని విడచి పెట్టి మరొక మెట్టు పైకి పోవాలి. అంటే రాజసికమైన తపస్సు చేయాలి.

అది కూడా శ్రేష్టమైంది కాదు. శంకరాచార్యుల శ్రీకృష్ణ పరమాత్ముని, సలహాను నేటి స్వామీజీలు, పండితులు ప్రచవన కారులు కూడా జాగ్రత్తగా గమనించాలి.

వారు కూడా సాధారణంగా ఈ మెట్టుపైనే ఉంటారు. చాలా మంది సత్కారం కొరకు, పాద పూజల కొరకు ఏమేమో చేస్తుంటారు. వారు కూడా ఈ మెట్టుపై నుంచి ఇంకా పై మెట్టుకు పోవడానికి అంటే సాత్త్విక తపస్సు చేయటానికి కృషి చేయాలి.

ఎలాంటి ఫలాపేక్ష లేక తపస్సు చేయాలి. తపస్సు చేయటమంటే ఈ లోక క్షేమం కొరకు తపించి శ్రమించటమే. మనకు తెలిసిన బుద్ధుడ్డు, క్రీస్తు రెండవ శ్రేణికి చెందిన వారని, మొదటి శ్రేణికి చెందిన వారు జీవితాంతం అజ్ఞాతంగా శ్రమించి వెళ్లిపోయారని వివేకానందస్వామి అంటాడు. వారు సాత్త్విక తపస్సు చేసినవారు.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/