రోజుకు లక్ష కరోనా టెస్టులు

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌

harsha vardan
harsha vardhan

న్యూఢిల్లీ: భారత్‌లో మే చివరి నాటికి రోజుకు లక్ష కరోనా టెస్టులు చేయగలిగే సామర్ధ్యం ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. నేడు డిపార్ట్‌్‌మెంట్‌ బయోటెక్నాలజి ఇన్‌స్టిట్యూట్‌ అధకికారుతలో విడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు భారత్‌ కరోనా పరీక్షల సామర్ధ్యం రోజురోజుకు పెరుగుతుందన్నారు. మే చివరి నాటికి యాంటి బాడి టెస్ట్‌ కిట్స్‌ తో పాటు, ఆర్టిపిసిఆర్‌(రివర్స్‌ ట్రాన్స్‌ స్క్రిప్షన్‌ పాలిమర్‌ చైన్‌ రియాక్షన్‌) కిట్లు ఉత్త్పత్తి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని, వీటికి ఐసిఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌) అప్రూవల్‌ రాగానే ఉత్త్పత్తి ప్రారంభిస్తామని అన్నారు. ఇవి అందుబాటులోకి వస్తే భారత్‌లో రోజుకు లక్ష మందికి కరోనా టెస్ట్‌ లు చేయవచ్చన్నారు. అలాగే రెండు వారాల క్రితం వరకు కరోనా కేసులు రెట్టింపు అవడానికిక 8.7 రోజులు పడుతుండగా.. ప్రస్తుతం అది 10.9 రోజులకు చేరుకుందని మంత్రి తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/