మహాసేన రాజేష్ ను టీడీపీ లో చేర్చుకోవద్దంటూ చంద్రబాబు కు హెచ్చరికలు

మహాసేన రాజేష్ టీడీపీ లో చేరేందుకు డిసైడ్ అయినా సంగతి తెలిసిందే. రెండు , మూడు రోజుల్లో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. అయితే రాజేష్ ను టీడీపీ లో చేర్చుకోవద్దంటూ దళిత ఐక్య వేదిక నాయకులు హెచ్చరించడం ఇప్పుడు చర్చ కు దారితీస్తుంది.

జర్నలిస్టుగా, వ్యాఖ్యతగా రాజేష్ కు మంచి పేరుంది. మహాసేన జర్నలిస్టుగా రాష్ట్ర ప్రజలకు బాగా సుపరిచితం. గత ఎన్నికల్లో సీఎం జగన్ సమక్షంలో వైస్సార్సీపీ లో చేరి..వైస్సార్సీపీ గెలుపు కోసం కష్టపడ్డాడు. ఆ తర్వాత పార్టీతో విబేధాలు రావడంతో బయటికొచ్చేశారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపిస్తూ పార్టీకి దగ్గర అవ్వడం , జనసేన కార్య కర్తల మనసు గెలుచుకోవడం జరిగింది. ఆ మధ్య జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫామ్ అయ్యిందని వార్తలు వినిపించాయి. ఏం జరిగిందో తెలియదు కానీ.. జనసేనతో కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. ఇక ఇప్పుడు టీడీపీ పార్టీలోకి వెళ్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఈ ప్రకటన చేసిన దగ్గరి నుండి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇక ఇప్పుడు దళిత ఐక్య వేదిక నాయకులు సైతం టీడీపీ లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబుకు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో రాజేష్ ఫేస్ బుక్ లైవుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ ఇతర టీడీపీ నేతలను బండ బూతులు తిట్టారని దళిత ఐక్య వేదిక నాయకులు గుర్తు చేస్తున్నారు. అతడిని చేర్చుకుంటే తామంతా టీడీపీకి దూరమవ్వాల్సి ఉంటుందని దళిత ఐక్య వేదిక నాయకులు హెచ్చరిస్తున్నారు.

రాజేష్ పక్కా ఉద్దేశంతోనే టీడీపీలోకి వస్తున్నాడని అతడిని పార్టీలో చేర్చుకోవద్దని చంద్రబాబును కోరుతున్నారు. తమ మాటను పెడ చెవిన పెడితే పార్టీ నష్టపోవడం ఖాయమంటున్నారు. మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.