ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

encounter
encounter

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో బుధవారం ఉదయం భద్రతాబలగాలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్‌లోని ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. వీరి రాకను పసిగట్టిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులతో తిప్పికొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వివరాలను సేకరించేందుకు యత్నిస్తున్నారు. ఇంకా ఎవరైనా ముష్కరులు ఉన్నారేమో అనే అనుమానంతో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/