పుదుచ్చేరి ఎల్జీగా తమిళిసై ప్రమాణ స్వీకారం

పుదుచ్చేరి: తెలంగాణ ప్రస్తుతం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ గురువారం ఉదయం పుదుచ్చేరి లేఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. అక్కడి రాజ్‌భన్‌లో తమిళిసై చేత మద్రాస్‌ హైకోర్టు ప్రధాని న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం వీ నారాయణస్వామి, ఇతర మంత్రులు హాజరయ్యారు. ఇప్పటివరకు ఎల్జీగా కొనసాగిన కిరణ్‌ బేడిని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో తెలంగాణ గవర్నర్‌ అయిన తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించారు.


కాగా, కిరణ్‌బేడి 2016 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పని చేశారు. పుదుచ్చేరిలో కిరణ్‌బేడి సహా నలుగురు మహిళలు లెఫ్టినెంట్‌ గవర్నర్లుగా పని చేశారు. తమిళం మాట్లాడే వ్యక్తిని గవర్నర్‌గా నియమించడం ఇదే తొలిసారి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/