వ‌రంగ‌ల్ క‌చ్చితంగా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం కావాలి

వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండగా మారుస్తున్నాం..సీఎం కెసిఆర్

వరంగల్ : వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లడుతూ..వ‌రంగ‌ల్ న‌గ‌రం గొప్ప విద్యా, వైద్య కేంద్రంగా మారాలి అని అన్నారు. ఇవాళ భూమి పూజ చేసిన మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి ఏడాదిన్న‌ర లోపు పూర్తి కావాలి. ఈ విష‌యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీరియ‌స్‌గా ప‌ని చేయాల‌న్నారు.

వ‌రంగ‌ల్ క‌చ్చితంగా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం కావాలి. గొప్ప విద్యాకేంద్రం, వైద్య కేంద్రం కావాలి. తూర్పు తెలంగాణకు ఇది ఒక హెడ్ క్వార్ట‌ర్ కావాలి. ప్ర‌పంచంలో అత్యంత అధునాత‌న వైద్య స‌దుపాయాలు కెన‌డాలో ఉన్నాయ‌ని తెలిసింది. వైద్య‌శాఖ అధికారుల‌తో క‌లిసి కెన‌డాను విజిట్ చేసి.. వీడియోలు, ఫోటోలు చిత్రీక‌రించండి. కెన‌డాను త‌ల‌ద‌న్నేలా ఆస్ప‌త్రి నిర్మాణం ఉండాలి. అన్ని వైద్య సేవ‌లు ఒకే ప్రాంగ‌ణంలో రావాలన్నారు.

కరోనాపై దుష్ప్రచారం సరికాదు. నాకు కూడా కరోనా వచ్చింది. కరోనా వస్తే టెంపరేచర్‌ పెరుగుతుంది. పారాసిటమాల్‌ వేసుకోమని డాక్టర్‌ చెప్పారు. నాకు కరోనా వచ్చినప్పుడు కేవలం పారాసిటమాల్‌ మాత్రమే వేసుకున్నా. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించొద్దు.

జైలు కూల్చతే నాకేమైనా వచ్చేది ఉందా. అయినా కూడా కొందరు విమర్శించారు. ఆశా వర్కర్లు ఇంటికి వెళ్లి ఫీవర్‌ సర్వే చేశారు. వాళ్లకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. త్వ‌ర‌లోనే మామునూర్ ఎయిర్‌పోర్టు రాబోతుంది. వ‌రంగ‌ల్‌లో మంచినీళ్ల గోస లేదు. వ‌రంగ‌ల్లో పెట్టుబ‌డులు రావాలి. ఐటీ కంపెనీల‌ను విస్త‌రించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండగా మారుస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వరంగల్‌ రూరల్‌ వరంగల్‌ జిల్లాగా ఉంటుందన్నారు. ఇకపై హన్మకొండ, వరంగల్‌ జిల్లాలు ఉంటాయన్నారు. వరంగల్‌ కలెక్టరేట్‌ను త్వరలోనే నిర్మిస్తామని పేర్కొన్నారు ఇతర జిల్లాల్లో కలెక్టరేట్‌ భవనాలు చాలా బాగున్నాయన్నారు. నిన్ననే వరంగల్‌ జిల్లాలకు వెటర్నరీ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కలెక్టర్‌ పేరు కూడా మార్చాలన్నారు. అది బ్రిటిష్‌ కాలంలో పెట్టిన పేరు అని తెలిపారు. ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్‌ సమస్యలు తీరాయన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/