న్యూయార్క్‌లో బంగ్లాదేశ్ ఓ సీఈవో హత్య

బంగ్లాదేశ్‌కు చెందిన రెండు కంపెనీల సీఈవో ఫహీమ్ సలేహ్ దారుణహత్య

Bangladesh origin ride-hailing app CEO found dismembered in new-york

న్యూయార్క్‌: అమెరికాలో న్యూయార్క్‌ నగరంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని న్యూయార్క్ లోని లగ్జరీ అపార్ట్‌మెంట్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్మెంట్ లో అతని శరీరం భాగాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. ఘటనా స్థలం నుంచి విద్యుత్ రంపంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపార శత్రుత్వంలో భాగంగానే సలేహ్ దారుణహత్య జరిగివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫహీమ్ సోదరి మంగళవారం మధ్యాహ్నం తన అపార్ట్మెంట్కు చేరుకున్న సమయంలో శవానికి దగ్గరగా మొండెం, తల, కాళ్ళు, చేతులు నరికి వేరు చేయబడ్డాయి. ఫహీమ్ ఫోన్ తీయకపోవడంతో సోదరుడిని కలవడానికి నేరుగా అపార్ట్మెంట్కు వచ్చానని సలేహ్ సోదరి పోలీసులకు తెలిపింది.

నైజీరియా రైడింగ్ అండ్ డెలివరీ యాప్ కంపెనీకి సీఈవోగా సలేహ్ ఉన్నారు. అలాగే, బంగ్లాదేశ్‌లో ‘పాథో’ పేరుతో ఇలాంటి కంపెనీనే నడుపుతున్నాడు. న్యూయార్క్ లో అతను హత్య చేయబడిన అపార్ట్మెంట్ విలువ సుమారు 2.2 మిలియన్లు డాలర్లు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫుటేజీలో ఒకదానిలో సలేహ్ ఎలివేటర్‌లో కనిపించగా.. మరో ఫుటేజీలో నలుపు రంగు సూటులో ఉన్న మరో వ్యక్తితో కనిపంచాడు. హంతకుడు ఫహీమ్ సన్నిహితుడే అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడికి అపార్ట్మెంట్ లోని అన్ని భాగాలు తెలుసు అని, శవాన్ని ముక్కలుగా కోసి తనతో తీసుకెళ్లాలని అనుకోగా ఫహీం సోదరి రావడంతో ప్రయత్నం విఫలమైందని పోలీసులు భావిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/