సుమ అడ్డాలోకి చిరంజీవి

బుల్లితెర సూపర్ స్టార్ అంటే ఎవరైన సుమ అనే అంటారు. ఆ రేంజ్ లో ఆమె పాపులార్టీ సాధించుకుంది. గత కొన్నేళ్లు గా టాప్ యాంకర్ గా ఆమె రాణిస్తూనే ఉంది. లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఆమెను పలు ఈవెంట్స్ కు ఆమె ను హోస్ట్ గా తీసుకుంటారు. అంతే కాదు పెద్ద హీరోల తాలూకా సినిమా ప్రమోషన్స్ అంటే సుమ నే యాంకర్ గా ఉండాలని కోరుకుంటారు. అంతలా ఆమెకు డిమాండ్.

అలాంటి ఆమె టాక్ షో కు మెగాస్టార్ చిరంజీవి హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది. ఈటీవీ లో గత కొంతకాలంగా ఆలీతో సరదాగా కార్యక్రమం, క్యాష్ కార్యక్రమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు షోస్ పూర్తి అయ్యాయి. దీంతో ఈటీవీ సుమ ను యాంకర్ గా పెట్టి “సుమ అడ్డా” అని ఒక కొత్త ప్రోగ్రాం రేపటి నుండి ప్రసారం చేయబోతుంది. ఈ షో మొదటి ఎపిసోడ్ కి సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ జంటగా నటించిన కళ్యాణం కమనీయం సినిమా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా షో కి హాజరు కాబోతున్నారు. దీనికి సంబదించిన ప్రోమో కూడా విడుదలై ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటె నెక్స్ట్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు లైవ్ లో కనిపించిన చిరు.. ఇలా గేమ్ షోలో ఎప్పుడు కనిపించలేదు. మరి మెగాస్టార్ బుల్లితెరపై సందడి చేస్తే ఎలా ఉంటుందో చూడడానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే రెండవ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి గెస్ట్లు గా రానున్నారని సమాచారం. చిరంజీవి ఒక టీవీ గేమ్ షో లాంటి దానికి హాజరు కావడం నిజంగా పెద్ద విషయమనే చెప్పాలి. గతం లో ఆహా లో సమంతా చాట్ షో కి చిరంజీవి హాజరయ్యారు.

అయితే అక్కడ సమంత ఉంది. కానీ ఇక్కడ సుమ చేస్తున్న గేమ్ షో కాబట్టి ఇందులో చిరంజీవి ఎలా సందడి చేస్తారో చూడాలని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు . సంక్రాంతి సందర్భంగా ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా సుమ షోకు చిరు హాజరు కాబోతున్నాడు.