బోల్డ్ సన్నివేశాలపై తమన్నా కామెంట్స్

Actress Tamannaah latest photos
Actress Tamannaah latest photos

మిల్కీ బ్యూటీ తమన్నా ..తాజాగా బోల్డ్ సన్నివేశాల ఫై ఓపెన్ అయ్యింది. కెరియర్ మొదట్లో హోమ్లీ పాత్రలతో మెప్పిస్తూ వచ్చిన ఈమె..ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో రెచ్చిపోయి నటిస్తూ.. అందాల ఆరబోత చేస్తుంది. దీంతో చాలామంది తమన్నా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో హాట్ హాట్ సన్నివేశాల్లో నటించడం ఫై స్పందించింది.

రొమాంటిక్ బెడ్ రూమ్ సన్నివేశాలు చేయాలనే ఆసక్తి లేదు.. కానీ కథ మరియు స్క్రీన్ ప్లే డిమాండ్ చేయడం వల్లే చేయాల్సి వస్తుంది అని తెలిపింది. ఒక హద్దు మేరకు తాను బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తాను అన్నట్లుగా పేర్కొంది. అంతే కాకుండా తన నుండి ముందు ముందు మంచి కంటెంట్ బేస్డ్ సిరీస్ లు మరియు సినిమాలు వస్తాయి అన్నట్లుగా అభిమానులకు హామీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈమె తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ మూవీ లో నటిస్తుంది. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తమిళంలో రజనీకాంత్ కు జోడీగా జైలర్ సినిమా లో కూడా నటిస్తోంది.