వరంగల్ లో కొనసాగుతున్న బంద్

కాకతీయ యూనివర్శిటీ (కేయూ) విద్యార్థి జాక్ వరంగల్ కు బంద్ పిలుపునిచ్చింది. కేయూ పీహెచ్డీ 2 కేటగిరి అడ్మిషన్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ..విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థులను గాయపర్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ తో వరంగల్ బంద్ కి పిలుపునిచ్చారు. కేయూలో వీసీ, రిజిస్ట్రార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి నేతలు.

ప్రస్తుతం వరంగల్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రపంచానికి ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులను అందించిన ఘనత వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయానిది. ఎన్నో ఉద్యమాలు ఈ విశ్వవిద్యాలయం లోనే పురుడు పోసుకున్నాయి. తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయుపట్టుగా నిలిచిన చరిత్ర ఈ విశ్వవిద్యాలయానిది. అలాంటి విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. విద్యార్థుల చదువులు సాగడం గండం లా మారిందని విద్యార్థి సంఘాలు వాపోతున్నారు.