నేడు సీబీఐ ప్రత్యేక కోర్టుకు సిఎం జగన్
అక్రమాస్తుల కేసులో జగన్ పై విచారణ

అమరావతి: ఏపి సిఎం జగన్ నేడు హైదరాబాదులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుకానున్నారు.అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా జగన్ హైదరాబాద్, నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రతి శుక్రవారం హాజరు కావాల్సి వుండగా, ఏపీ సీఎం అయిన తరువాత పాలనపరమైన వ్యవహారాలతో బిజీగా ఉన్నందున జగన్ కోర్టుకు గైర్హాజరవుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇంక మినహాయింపు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేయడంతో నేడు ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. సీఎం హోదాలో కోర్టుకు రావాలంటే, భద్రతా కారణాలు, బందోబస్తు ఖర్చులను కారణాలుగా చూపుతూ, జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థించగా, న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఆయన నేడు కోర్టుకు హాజరు కానున్నారు.
తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్ చేయండి:https://epaper.vaartha.com/