‘సైమా అవార్డ్స్ ల్లోనూ’ పుష్ప హావ

సైమా అవార్డ్స్ 2022 లో పుష్ప తగ్గేదే లే అనిపించాడు. ఒకటి , రెండు కాదు ఏకంగా ఆరు అవార్డ్స్ దక్కించుకుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషన్‌ మూవీ అవార్డ్స్) అవార్డుల పురస్కారం బెంగళూరు వేదికగా ఈ శని-ఆదివారాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దక్షణాది తారలతో పాటు ఉత్తరాది తారలు కూడా హాజరయ్యారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్.. యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్.. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్.. విజయ్ దేవరకొండ.. యశ్ ఇంకా సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు.

సైమా 2022 అవార్డు వేడుకల్లో పుష్ప సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు దక్కాయి. ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ అవార్డును అందుకున్నాడు. ఉత్తమ సినిమాగా పుష్ప సినిమా కు గాను మైత్రి మూవీ మేకర్స్ వారు అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా పుష్ప సినిమాకు గాను సుకుమార్.. ఉత్తమ సంగీత దర్శకుడిగా పుష్ప సినిమా ఆల్బంకి గాను దేవిశ్రీ ప్రసాద్ సైమా అవార్డులను అందుకున్నారు.

ఇంకా ఉత్తమ సహాయ నటుడిగా పుష్ప సినిమాలోని కేశవ పాత్రలో నటించిన జగదీష్ కి అవార్డు దక్కింది. ఇక ఉత్తమ పాటల రచయిత కేటగిరిలో పుష్ప సినిమా పాటకు గాను చంద్రబోస్ అవార్డును దక్కించుకున్నాడు. మొత్తానికి ఈ ఏడాది అత్యధికంగా సైమా అవార్డులను సొంతం చేసుకున్న సినిమాగా పుష్ప సినిమా నిలిచింది.

ఇందులో ఉత్తమ చిత్రం నామినేషన్ లో పుష్ప, అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలు నిలవగా.. పుష్ప ఉత్తమ చిత్రం అవార్డుని అందుకుంది. బెస్ట్ లీడింగ్ రోల్ నామినేషన్ లో అల్లు అర్జున్, బాలకృష్ణ, అల్లరి నరేష్, నాని, నాగ చైతన్య, నవీన్ పోలిశెట్టి పోటీలో నిలవగా.. బెస్ట్ లీడింగ్ రోల్ కు అల్లు అర్జున్, బెస్ట్ లీడింగ్ రోల్(క్రిటిక్స్) కు నవీన్ పోలిశెట్టి అవార్డులు అందుకున్నారు. అలాగే ‘మోస్ట్ ఎలిజబుల్ బాచిలర్’ మూవీకు గాను బెస్ట్ ఫిమేల్ లీడ్ యాక్టర్స్ గా పూజ హెగ్దే అందుకుంది.