వాల్తేర్ వీరయ్య – వీరసింహ రెడ్డి 25 డేస్ కలెక్షన్స్

వీరసింహ రెడ్డి , వాల్తేర్ వీరయ్య చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా హావ కొనసాగిస్తూనే ఉన్నాయి. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ సాధించాయి. చాల కలం తర్వాత నందమూరి బాలకృష్ణ, మెగా స్టార్ చిరంజీవి బరిలోకి దిగడం, రెండు సినిమాలు సూపర్ హిట్స్ సాధించడం తో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక కలెక్షన్లు సైతం రికార్డు స్థాయి లో రావడం తో నిర్మాతలు , డిస్ట్రబ్యూటర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి రెండు చిత్రాలు కూడా 25 రోజులు పూర్తి చేసుకున్నాయి.

ఈ రెండు సినిమాల 24 రోజుల కలెక్షన్స్ చూస్తే..

వాల్తేర్ వీరయ్య :

నైజాం రూ. 35.82 కోట్లు
సీడెడ్ లో రూ.18.09 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.19.06 కోట్లు
ఈస్ట్ లో రూ.12.90 కోట్లు
రూ. వెస్ట్ లో రూ. 7.08 కోట్లు
గుంటూరులో రూ. 9.11 కోట్లు
కృష్ణ లో రూ. 7.66 కోట్లు
నెల్లూరులో రూ. 4.57 కోట్లు

మొత్తంగా రూ. 114.39 షేర్ రూ. 185.08 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 135.77 కోట్ల షేర్, రూ. 231.80 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

వీర సింహ రెడ్డి 25 రోజుల్లో :

నైజాం 17.31కోట్లు
సీడెడ్ రూ. 16.50 కోట్లు
ఉత్తరాంధ్ర రూ.8.55 కోట్లు
తూర్పు గోదావరి రూ.6.60 కోట్లు
పశ్చిమ గోదావరి రూ. 4.90 కోట్లు
గుంటూరు రూ.7.42 కోట్లు
కృష్ణ రూ. 4.73 కోట్లు
నెల్లూరు రూ. 3.00 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ. 69.01 కోట్లు (రూ.112.25 కోట్లు గ్రాస్)గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 25 రోజులు కలిపి చూస్తే.. రూ. 79.63 కోట్లు షేర్ (రూ. 133.55 కోట్లు గ్రాస్) వసూళ్లు సాధించింది.