రామ్ కు విలన్ గా ప్రిన్స్

ఇస్మార్ట్ శంకర్ తో అసలైన మాస్ హిట్ అందుకున్న రామ్..ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి..అదే జోష్ తో రామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ లో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటుడు ప్రిన్స్ ను చేసినట్లు తెలుస్తుంది. హీరోగా కెరియర్ మొదలుపెట్టిన ప్రిన్స్ ..కెరియర్ మొదట్లో ఒకటి , రెండు హిట్లు కొట్టి యూత్ కు దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ప్లాప్స్ కావడం తో హీరోగా ఛాన్సులు తగ్గాయి. ఈ మధ్యనే డీజే టిల్లు మూవీ లో ఓ కీలక పాత్ర చేసి ఆకట్టుకున్నాడు.

ఇక ఇప్పుడు బోయపాటి సినిమా తో విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విలన్ పాత్ర ఎంతగా హైలైట్ అయితే హీరో పాత్ర అంతగా హైలైట్ అని నమ్మే బోయపాటి శ్రీను కొత్త కొత్త గా విలన్ల ను వెతికి పట్టుకొని మారి వారిని ఫేమస్ గా మారుస్తారు. జగపతి బాబుకి బోయపాటి ఇచ్చిన బూస్ట్ అతని కెరియర్ ను సూపర్ హిట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రిన్స్ కెరియర్ ను కూడా అలాగే సూపర్ హిట్ చేయాలనీ..రామ్ కు తగ్గ విలన్ ప్రిన్స్ అని బోయపాటి ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బోయపాటి కి 10 వ చిత్రం కాగా, రామ్ కు 20 వ చిత్రం కావడం విశేషం.