వాల్తేర్ వీరయ్య లోని సాంగ్ ను లీక్ చేసిన చిరంజీవి

వాల్తేర్ వీరయ్య మూవీ లోని నువ్వు శ్రీదేవైతే .. నేను చిరంజీవి అంటూ సాగే సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి లీక్ చేసారు. గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి సందర్బంగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన బాస్ సాంగ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకోగా..ఇక సినిమాలోని నువ్వు శ్రీదేవైతే .. నేను చిరంజీవి అంటూ సాగే సాంగ్ చిరంజీవి లీక్ చేసారు.

చిరంజీవి – శృతి హాసన్ ల ఫై ఈ సాంగ్ ను ప్యారిస్ లో షూట్ చేయడం జరిగింది. ఆ పాటకి సంబంధించిన ఒక ఫొటోను చిరంజీవి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ‘నువ్వు శ్రీదేవైతే నేను చిరంజీవి’ అంటూ ఈ పాట సాగనున్నట్టుగా చెప్పారు. పాటకి సంబంధించిన స్టిల్ లో చిరంజీవి ఫ్లూట్ వాయించే భంగిమలో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక ఆయన సరసన శ్రుతి హాసన్ మంచుకొండల్లో విరిసిన మల్లెమొగ్గలా అందాలు వెదజల్లుతోంది. మొత్తానికి లేటెస్ట్ గా వదిలిన ఈ స్టిల్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.