రాజమౌళి ఇంట తీవ్ర విషాదం

గత కొద్దీ రోజులుగా టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. రెబెల్ స్టార్ కృష్ణం రాజు , ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ వంటి దిగ్గజ నటులను ఈ మధ్యనే కోల్పోగా..తాజాగా రాజమౌళి ఇంటి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కీరవాణి తల్లి కన్నుమూశారు. కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈమెకు ఇంటి వద్దే చికిత్స అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం విషమించడం తో ఈరోజు కన్నుమూశారు.

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా అన్నదమ్ములు అనే సంగతి తెలిసిందే. అందరూ ఉమ్మడి కుటుంబంలోనే పెరిగారు. రాజమౌళికి పెద్దమ్మ అంటే ఎంతో ఇష్టం కావడంతో ఆమె మృతదేహాన్ని రాజమౌళి ఇంటికి తరలించారు. రాజమౌళి ప్రతి సినిమాకు కీరవాణినే సంగీతం అందిస్తారు. అన్నదమ్ములు ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో నిలువడం విశేషం. కీరవాణి తల్లి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.