150 విశ్వవిద్యాయాల్లో కొత్త కోర్సులు

జాతీయ పోలీసు విశ్వవిద్యాలయం, నేషనల్‌ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీల ఏర్పాటు

Nirmala Sitharaman.
Nirmala Sitharaman.

న్యూఢిల్లీ: 2026 నాటికి దేశంలోని 150 విశ్వవిద్యాయాల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. అధ్యాపకులు, పారామెడికోల కొరత తీర్చేవిధంగా జాతీయ విద్యావిధానాన్ని తీసుకు వస్తున్నట్లు చెప్పారు. అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి 3వే కోట్ల రూపాయలు కేటాయించారు. డిగ్రీ స్థాయిలో ఆన్‌లైన్‌ విద్యావిధానాన్ని ప్రారంభించి, జాతీయ విద్యా సంస్థల జాబితాలో టాప్‌ 100లో ఉన్న కళాశాలల్లో వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి ప్రకటించారు. భారత్‌లో చదువుకునే విద్యార్థుల కోసం ‘ఇండ్‌శాట్‌’  పేరుతో స్టడీ ఇన్‌ ఇండియా ప్రోగ్రాం రూపొందించినట్లు తెలిపారు. కాగా వార్షిక బడ్జెట్‌లో మంత్రి నిర్మలాసీతారామన్‌ విద్యాభ్యున్నతికి ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా నాణ్యమైన విద్య, ఉత్తమ కోర్సులు అందించాలన్న లక్ష్యం బడ్జెట్‌లో కనిపించింది. విద్యారంగంలోకి విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. జాతీయ పోలీసు విశ్వవిద్యాలయం, నేషనల్‌ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/