నారాయణఖేడ్ లోని కస్తుర్భా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్

Food poison in Kasturba girls hostel at Narayankhed

గత కొద్దీ నెలలుగా తెలంగాణ లో వరుసగా ప్రభుత్వ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు విద్యార్థులను , వారి తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు.. ఆహారం తినాలంటే భయపడుతున్నారు. నీళ్లు తాగాలంటే టెన్షన్ పడుతున్నారు.. ఏ క్షణం అనారోగ్యానికి గురవుతారో అని ఆందోళనపడుతున్నారు.. ఎప్పుడు ఎవరు సడెన్‌గా పడిపోతారో వాళ్లకే తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు ఆశ్రమాలలో , కాలేజీ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు హాస్పటల్ పాలవ్వగా. రీసెంట్ గా జనగాం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన మరచిపోకముందే ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లోని కస్తుర్భా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది.

నారాయణఖేడ్ లోని కస్తుర్భా బాలికల వసతి గృహంలో పురుగుల టిఫిన్ తినడంతో దాదాపు 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైయ్యారు. వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం చేసిన టిఫిన్ లో పురుగులు రావడం విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.