ఓటిటి లో సందడి చేస్తున్న వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య ఓటిటిలోకి వచ్చేసింది. బాబీ – చిరంజీవి కలయికలో శృతి హాసన్ హీరోయిన్ గా రవితేజ కీలక పాత్రలో నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. టాక్ పరంగానే కాదు వసూళ్ల పరంగా కూడా మెగా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించడం స్టార్ట్ చేసింది.

బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య వంతు వచ్చింది. ఓ వైపు ధియేటర్‌లో కనకవర్షం కురిపిస్తూనే..ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి అంటే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలి కాలంలో మెగాస్టార్ చిరంజీవికి ఇదే మేజర్ హిట్ అని చెప్పవచ్చు. ఆచార్య డిజాస్టర్‌గా నిలిస్తే..గాడ్ ఫాదర్ యావరేజ్‌గా ఆకట్టుకుంది. వాల్తేరు వీరయ్య మాత్రం పూనకాలు తెప్పిస్తోంది.

ఇక ఈ మూవీ హిట్ తో చిరు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో వేదాళం రీమేక్ భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , కీర్తి సురేష్ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో గత కొద్దీ రోజులుగా శరవేగంగా జరుగుతుంది.