నేడు సిసోడియాను కోర్టులో హాజరుపరచనున్నసీబీఐ అధికారులు

CBI officials will present Sisodia in the court today

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియాను నేడు సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఎయిమ్స్లో మెడికల్ టెస్టుల తర్వాత సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. అనంతరం సీబీఐ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. అయితే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నిన్న ఉదయం 11 గంటలకు సిసోడియాను విచారణకు పిలిచిన సీబీఐ దాదాపుగా ఎనిమిది గంటలపాటు విచారించి అనంతరం అరెస్ట్​ చేసింది. తాము అడిగిన ప్రశ్నలకు సిసోడియా నుంచి సరైన స్పందన రాలేదని, ఆయన చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని పేర్కొంది. లిక్కర్​ పాలసీలో జరిగిన అవకతవకలపై సీబీఐ, మనీలాండరింగ్​పై ఈడీ దర్యాప్తు జరుపుతున్నాయి. ఇప్పటివరకు సీబీఐ, ఈడీ 12 మందిని అరెస్టు చేశాయి. లిక్కర్​ స్కామ్​ కేసు ఎఫ్​ఐఆర్​లో మనీశ్​ సిసోడియా ఏ1 నిందితుడిగా ఉన్నారు.