నిఖిల్ కోసం రంగంలోకి దిగిన శింబు

తమిళ్ హీరో శింబు హీరోగానే కాదు సింగర్ గా కూడా తన టాలెంట్ చూపిస్తుంటారు. తెలుగులో ఇప్పటికే పలు పాటలు పాడిన ఈయన..ఇప్పుడు హీరో నిఖిల్ కోసం ఓ సాంగ్ పాడినట్లు తెలుస్తుంది. కార్తికేయ 2 తో భారీ హిట్ అందుకున్న నిఖిల్..ప్రస్తుతం 18 పేజెస్ మూవీ తో రాబోతున్నాడు. కార్తికేయ 2 లో నిఖిల్ కు జోడిగా నటించిన అనుపమ..18 పేజెస్ లో కూడా జోడి కట్టడం తో యూత్ లో ఈ సినిమా ఫై క్రేజ్ ఏర్పడింది.

ఇక ఇటు నిఖిల్ కు అటు సంగీత దర్శకుడు గోపీ సుందర్ కు మంచి ఫ్రెండ్ కావడంతో శింబు ఈ సినిమాలో ఓ పాట పాడాడట. ‘ఇవ్వు పిల్లా..టైమ్ ఇవ్వు పిల్లా’ అంటూ సాగే ఈ సాంగ్ ను శింబు పాడాడు. దర్శకుడు సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ సూపర్ విజన్ లో ఈ సినిమాను నిర్మించారు. గతంలో సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ ను అందించిన ప్రతాప్ నే ఈ 18 పేజెస్ కు దర్శకుడు. ఒక ఫీల్ గుడ్ యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.