ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ టూర్..

MLC kavitha delhi tour

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ టూర్ చర్చ గా మారింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఐటీ , ఈడీ , సిట్ అంత కూడా వరుస దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఐటీ అధికారులు టిఆర్ఎస్ నేతలను టార్గెట్ అన్నట్లు వరుస పెట్టి రైడ్స్ చేస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్యే ల కొనుగోలు విషయంలో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసారు. ఇవే అనుకుంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అధికారులు దూకుడు పెంచారు. దర్యాప్తులో భాగంగా స్కాంతో సంబంధమున్న కీలక వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదురుకుంటున్న కవిత ఢిల్లీ కి వెళ్లడం ఇప్పుడు చర్చ గా మారింది. ఢిల్లీ లో ఆమె న్యాయ నిపుణుల బృందాన్ని కలిసినట్లు తెలుస్తుంది.

లిక్కర్ స్కామ్ కేసులో ఒకవేళ సీబీఐ, ఈడీ నుంచి నోటీసులు వస్తే ఎలా ముందుకు వెళ్లాలని కవిత యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకునేందుకే ఢిల్లీ వెళ్లారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. న్యూఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లోని కేసీఆర్ నివాసంలో ఆమె న్యాయ నిపుణులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈడీ అధికారులు.. ఆమెకు సంబంధించిన కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే.