నేడు బైంసాలో బండి సంజయ్ బహిరంగ సభ

Bandi Sanjay public meeting in Bhainsa today

హైదరాబాద్‌ః బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత కరీంనగర్‌ నుంచి నిర్మల్‌కు వెళ్లిన బండి సంజయ్.. అడెల్లి పోచమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సారంగపూర్‌ వరకు 3 కిలోమీటర్లమేర పాదయాత్ర చేశారు. సోమవారం రాత్రి గుండెగాంలో బస చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1.30కి భైంసా శివారులో బహిరంగ సభ జరగనుంది. నిర్మల్ నేషనల్ హైవే పక్కన ఉన్న గణేశ్ ఇండస్ట్రీ ప్రాంగణంలో దీన్ని నిర్వహించాలని నిన్న రాత్రి 11 గంటలకు పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఈ సభకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

కాగా, ఈ పాదయాత్ర ప్రారంభించకుండా ఆదివారం పోలీసులు బండి సంజయ్‌ని అడ్డుకోవడంతో.. సోమవారం దీనిపై హైకోర్టును ఆశ్రయించింది బిజెపి. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు.. భైంసా సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే సభ నిర్వహించుకోవాలని తెలిపింది. అలాగే భైంసా సిటీ గుండా పాదయాత్ర వెళ్లకూడదని సూచించింది. పాదయాత్రలో పాల్గొన్నవారు ఎలాంటి ఆయుధాలూ వాడకూడదని తెలిపింది. అందుకు అంగీకరించిన బిజెపి నేతలు.. ఆ ప్రకారమే తమ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నారు. భైంసా వెళ్లకూడదని, సభను కూడా భైంసా టౌన్‌కు 3 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని చెప్పింది. 500 మందితో పాదయాత్ర, 3 వేల మందితో సభ జరుపుకోవాలని ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపే మీటింగ్‌ పెట్టుకోవాలని సూచించింది. ఇతర మతాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని…అలాగే కార్యకర్తలు కర్రలు, ఆయుధాలు వాడొద్దని హైకోర్టు స్పష్టంచేసింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/