వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారు : రేవంత్ రెడ్డి

ఐదు నెలలుగా అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నా: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అతిపెద్ద అవినీతిపరుడని ఆయన ఆరోపించారు. వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఈ విషయాలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం తాము గత ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నామని… ఆయన అపాయింట్ మెంట్ ఇస్తే కేసీఆర్ అవినీతిపై అన్ని ఆధారాలు ఇస్తామని చెప్పారు.

తెలంగాణ వస్తే నీళ్లు, నియామకాలు అన్నీ మన చేతిలోకి వస్తాయని జనాలను నమ్మించిన కేసీఆర్… ఆ తర్వాత రాష్ట్రాన్ని కొల్లగొట్టారని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లను దోచుకున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించే దమ్ము కేసీఆర్ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని తాను నిరూపిస్తానని… లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/