ఆర్ఆర్ఆర్ సెకండ్ సాంగ్ రిలీజ్..ఎన్టీఆర్ , చరణ్ లు కుమ్మేసారు

ఆర్ఆర్ఆర్ నుండి అసలు సిసలైన నాటు సాంగ్ వచ్చింది. ‘నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు.. నాటు నాటు నాటు నాటు నాటు నాటు.. వీర నాటు.. ఊర నాటు’ అంటూ సాగే ఈ ఫుల్ సాంగ్ ను చిత్ర యూనిట్ బుధువారం సాయంత్రం విడుదల చేసారు. ఈ సాంగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ పవర్ ఫుల్ స్టెప్పులతో దుమ్ములేపినట్లు అర్థం అవుతోంది. ఎంఎం కీరవాణి ఈ పాటకు మాస్ ట్యూన్ సమకూర్చగా.. రాహుల్ సిప్లింగంజ్ – కాల భైరవ హుషారెత్తించేలా ఆలపించారు. ఈ గీతానికి గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు.

అన్నింటి కంటే ఎక్కువగా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను అలా చూడటంతో అభిమానులకు కడుపు నిండేలా కనిపిస్తోంది. ఇక ఈ ఇద్దరూ కలిసి వేసిన స్టెప్పులకు నిజంగానే దుమ్ములేచిపోయింది. ఈ పాటలో ఎన్టీఆర్ సరసన కనిపించే ఒలివియా మోరిస్ కూడా స్టెప్పులు వేసింది. బ్రిటీష్ రాజులను అలరించేందుకు ఇలా ఈ ఇద్దరూ కలిసి డ్యాన్సులు వేసినట్టు కనిపిస్తోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ థియేటర్స్ లలో అభిమానులను ఫుల్ గా రంజిపచేస్తుందని అర్ధమవుతుంది.

YouTube video