తెలంగాణలో అతిపెద్ద ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం
రూ. 207 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు

హైదరాబాద్: చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్… తెలంగాణలో అతిపెద్ద ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. రూ.207 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లాలోని గోవింద్‌పూర్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 250 మందికి ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా మరో 250 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, స్థానికంగా ఉన్న సుమారు 4 వేల మంది పాడి రైతులు ప్రయోజనం పొందుతారని కంపెనీ తెలిపింది.ప్రస్తుతం ప్లాంట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్లాంట్ కార్యకలాపాలు ఆరంభమవుతాయని పేర్కొంది. హట్సన్ సంస్థ అరుణ్ ఐస్ క్రీమ్, హట్సన్, ఆరోక్య మిల్క్, ఐబాకో ఐస్‌క్రీమ్స్, ఓయాలో, అనీవా, సంటోసా బ్రాండ్లతో పాలు, పెరుగు, ఐస్‌క్రీమ్స్, నెయ్యి, పన్నీర్ వంటి అన్ని రకాల పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాల్లో ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/