అప్పుడే పుట్టిన బిడ్డను కూడా వదలని కరోనా

తల్లి ద్వారా బిడ్డకు సంక్రమించిందన్న వైద్యులు

Coronavirus
Coronavirus

చైనా: కరోనా వైరస్‌ చైనాను వణికిస్తోంది. దీని వల్ల చైనాలో రోజురోజుకూ కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ వైరస్ అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా సోకుతుందని ఓ ఘటన ద్వారా వెల్లడైంది. చైనాలో ఓ పసికందు ఈ భూమ్మీద అడుగుపెట్టిన కొన్నిగంటల్లోనే కరోనా బారినపడింది. ఆ చిన్నారికి తల్లి ద్వారా వైరస్ సంక్రమించిందని డాక్టర్లు తెలిపారు. దీన్ని వెర్డికల్ ట్రాన్స్ మిషన్ అంటారని, ప్రసవానికి ముందే తల్లికి కరోనా వైరస్ సోకిందని వెల్లడించారు. అయితే, హార్బిన్ నగరంలో ఓ కరోనా బాధితురాలు బిడ్డకు జన్మనివ్వగా, ఆ బిడ్డకు వైరస్ సోకలేదని వెల్లడైంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/