గుండెపోటుతో విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం కన్నుమూత..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ (పీపీఎం) విభాగంలో డీజీఎంగా పనిచేస్తున్న టి.వి.వి. ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం ఉదయం జనరల్‌ షిఫ్ట్‌కు వచ్చిన ప్రసాద్‌.. ఈడీ (వర్క్స్‌) ఆఫీస్ మూడో ఫ్లోర్‌లో లిఫ్ట్‌ దిగి తన రూమ్‌కు వెళుతుండగా ఒక్కసారిగా.. నడుస్తూనే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన తోటి ఉద్యోగుల.. వెంటనే పరుగన వచ్చి.. వరప్రసాద్‌ను ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు.

ఆ తర్వాత అక్కడ నుంచి ఉక్కు జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండాపోయింది. అప్పటికే వర ప్రసాద్‌ చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. వరప్రసాద్‌ మృతికి ఆకస్మిక గుండెపోటు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. డీజీఎం ప్రసాద్ మరణంతో కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు తీవ్ర విషాదంలో ఉన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. టి.వి.వి. ప్రసాద్ 1995లో మేనేజ్ మెంట్ ట్రైనీగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ డీజీఎం స్థాయికి చేరుకున్నారు. సోమవారం ఉదయం జనరల్ షిఫ్ట్ లో ప్రసాద్ విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో తన గదికి వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలారని సహోద్యోగులు తెలిపారు.