నేడు జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

హైదరాబాద్: సీఎం కెసిఆర్ నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండున్నరకు హెలికాప్టర్‌లో జనగామకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. ముందుగా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చించనున్నారు కేసీఆర్. అధికారులతో సమీక్ష అనంతరం భోజనం చేసి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జనగామ జిల్లా మోడల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, ఇక్కడే పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు కేసీఆర్. సీఎం సభకు భారీ ఏర్పాట్లు చేశారు నేతలు. జనగామ పట్టణాన్ని గులాబీ జెండాలతో అలంకరించారు. సుమారు లక్షా 30 వేల మంది సభకు హాజరు కానున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/