ఎన్టీఆర్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయినా సైఫ్

బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్..ఎన్టీఆర్ 30 వ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈయన చిత్ర సెట్ లో జాయిన్ అయ్యారు. కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ తర్వాత తాజాగా మరో మూవీ సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధ ఆర్ట్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జాన్వీ కి ఇదే మొదటి తెలుగు సినిమా కావడం విశేషం.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో సెట్ లో సైఫ్ అలీఖాన్ జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ – సైఫ్ అలీఖాన్ లపై డైరెక్టర్ కొరటాల సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంలో కొరటాల – ఎన్టీఆర్ తో కలిసి సైఫ్ దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయి లో ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడం తో దీనిపై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి.