ఏదో విధంగా నన్నుఅంతం చేయాలని చూస్తున్నారు : దస్తగిరి

viveka-murder-case-accused-dastagiri-complaints-to-kadapa-sp

కడప : వైస్సార్సీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వివేకా హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తొండూరు పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తొండూరుకు చెందిన పెద్ద గోపాల్ తరచూ తనను లక్ష్యంగా చేసుకుని గొడవ పడుతున్నారని, ఏదో విధంగా తనను అంతం చేయాలని చూస్తున్నారని దస్తగిరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్నాననే ఉద్దేశంతో తనను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ ఫిర్యాదులో తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టిన విషయాన్ని సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు కూడా వివరించినట్లు దస్తగిరి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/