ఇష్టారాజ్యంగా ధరలను పెంచేశారన్నారు : దేవినేని ఉమ

devineni uma maheswara rao
devineni uma maheswara rao

అమరావతి: ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రజలను ఎడాపెడా బాదేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అని మాట్లాడిన జగన్‌.. ఇప్పుడు ఇష్టారాజ్యంగా ధరలను పెంచేశారన్నారు. టీడీపీ హయాంలో ఇసుక ఉచితంగా ఇస్తే.. జగన్‌ సర్కార్‌లో రూ.లక్ష ఇస్తేనే గానీ లారీ ఇసుక దొరికే పరిస్థితి లేదన్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో ఆస్పత్రి చార్జీలు పెంచేశారన్నారు. ఎన్టీఆర్‌ సమయంలో పక్కా ఇల్లు నిర్మిస్తే.. దానికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో రూ.10 వేలు వసూలు చేస్తున్నారని దేవినేని ఉమ పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. బాదుడే బాదుడే చేస్తున్న జగన్‌రెడ్డిని తిరిగి బాది క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, బ్రింగ్‌ బాబు నినాదంతో చంద్రబాబును తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని దేవినేని ఉమ కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/