ఢిల్లీలో మరోసారి పెరిగిన వాయు కాలుష్యం

delhis-air-quality-remains-very-poor-with-aqi-at-329

న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో గాలినాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీలో శుక్రవారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ 329గా నమోదైంది. నగరంలో అత్యధికంగా అత్యధికంగా ఆన్‌విహార్‌లో 834గా రికార్డయింది. రోహిణి, ఝిల్‌మిల్‌, సోనియా విహార్‌లో గాలి నాణ్యత పేలవమైన స్థాయికి చేరుకుంది. ఇక ఢిల్లీ రాజధాని ప్రాంత పరిధిలోని నోయిడా, గురుగ్రామ్‌లో కూడా గాలి నాణ్యత పడిపోయింది. గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయి.

కాగా, పంజాబ్, హర్యానాలో జరిగిన ఫైర్స్ వల్ల కూడా పొల్యూషన్ పెరిగిందని అధికారులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో గత రెండు రోజుల నుంచి 12వందలకు పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయన్నారు. రానున్న రోజుల్లో పొల్యూషన్ తగ్గే అవకాశం ఉందన్న అధికారులు…. ప్రస్తుతం వెరీ పూర్ కేటగిరిలో ఉండగా మరో ఆరు రోజుల్లో పూర్ కేటగిరిలోకి చేరే చాన్స్ ఉందని చెప్పారు.