వివేకా హత్య కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు

దోషులను తప్పించి అమాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు

kanna lakshmi narayana
kanna lakshmi narayana

అమరావతి: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..వివేకా హత్య కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. దోషులను తప్పించి అమాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే పోలీసు అధికారులను బదిలీ చేస్తున్నారన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలంటూ.. వివేకా కుటుంబ సభ్యుల కంటే ముందే తాను సీఎంకు లేఖ రాశానని కన్నా వెల్లడించారు. తన తండ్రి ఆశయాలు, సిద్ధాంతాలపై సీఎం జగన్ నమ్మకం ఉంటే.. పరిటాల రవి హత్య కేసు మాదిరిగా వివేకా హత్య కేసునూ సీబీఐకి అప్పగించాలన్నారు. జగన్.. వైఎస్ రాజకీయ వారసుడయితే స్వచ్ఛందంగా సీబీఐ విచారణ కోరాలని కన్నా పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/