ఆ దేశానికి ఏ సహాయం చేయడానికైనా సిద్ధం

Donald Trump
Donald Trump

అమెరికా: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పటికే 10 దేశాలకు వ్యాపించింది. తాజాగా ఈవైరస్‌ జర్మనీకి కూడా వ్యాపించింది. తమ దేశంలో ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు పరిస్థితులను నిత్యం పరిశీలిస్తున్న అమెరికా.. చైనాకు అవసరమైన సూచనలు అందిస్తోంది. ఇరు దేశాల అధికారులు ఇప్పటికే పలు మార్లు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తాము చైనాకు ఏ సహాయం చేయడానికైనా సిద్ధమని ట్రంప్‌ ప్రకటించారు. మేము చైనా అధికారులతో నిరంతరం చర్చిస్తున్నాం. అమెరికాలో అతి కొద్ది మంది మాత్రమే ఈ వైరస్‌ బారిన పడ్డారు. అయితే కరోనా కట్టడిలో చైనాకు ఏ సహాయం చేసేందుకైనా మే సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/