నేడు ఏపి కేబినేట్‌ సమావేశం

ap-cabinet
ap-cabinet

అమరావతి: ఈరోజు ఉదయం 10.30గంటలకు ఏపి కేబినేట్‌ సమావేశం జరగనుంది. ఈసమావేశంలో సూమారు 30అంశాలపై కేబినెట్ చర్చించనుంది. అంతేకాక ఏపి-తెలంగాణ మధ్య డేటా చోరీ వివాదంపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉందని సమాచారం. అంతేగాక అగ్రిగోల్డ్‌ బాధితులకు నష్ట పరిహారంపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. అలాగే పలు సంస్థలకు కేబినెట్‌ భూములు కేటాయించనుంది.