నేడు పీఆర్సీ సాధక సమితి తో చర్చలకు ఆహ్వానం
ప్రధాన అంశాలుగా హెచ్ఆర్ఏ తో పాటు, రికవరీ, అదనపు క్వాంటం పెన్షన్

Amaravati: ఏపీలో పీఆర్సీ జీవోపై సమస్య ఒక కొలిక్కి వచ్చేలా కనిపించటం లేదు . మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళన ఉధృత మైంది . కాగా , మంగళవారం పీఆర్సీ సంబంధించిన అంశాలపై సచివాలయంలో మంత్రుల కమిటీతో చర్చలకు రావాల్సిందిగా పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుపనున్నారు. మంత్రుల కమిటీతో హెచ్ఆర్ఏ అంశాలతో పాటు, రికవరీ, అదనపు క్వాంటం పెన్షన్ వంటి అంశాలు చర్చకు రానున్నట్టు తెలిసింది.
కరోనా లాక్ డౌన్ వార్తల కోసం: https://www.vaartha.com/corona-lock-down-updates/