విశ్వక్ సేన్ ‘దమ్కీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఓరి దేవుడా అంటూ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో విశ్వక్ సేన్..ఇప్పుడు ‘దమ్కీ’ అంటూ రాబోతున్నాడు. స్వీయ దర్శకత్వంలో ..కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్నకుమార్ కథని సమకూరుస్తున్నాడు. ఇటీవలే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ మూవీ ని తెలుగు, తమిళ ,మలయాళ , హిందీ భాషల్లో ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన నాయికగా నివేదా పేతురాజ్ అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్ .. రోహిణి .. అజయ్ కనిపించనున్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.