హాస్పిటల్ నుంచి ఐశ్వర్య రాయ్, ఆరాధ్య డిశ్చార్జ్

ఐశ్వర్య రాయ్, ఆరాధ్యకు కరోనా నెగిటివ్

aishwarya-rai-aaradhya

ముంబయి: ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్య. ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో వారం రోజుల కింద హోమ్ క్వారంటైన్ నుంచి హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఇద్దరూ ముంబయి లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేసాడు. తన భార్యతో పాటు కూతురుకు కూడా నెగిటివ్ వచ్చిందని.. దాంతో వాళ్లను డిశ్చార్జ్ చేసారని తెలిపాడు. కానీ తండ్రి అమితాబ్‌తో సహా తాను కూడా ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నామని.. మరికొన్ని రోజులు వైద్యుల సమక్షంలోనే ఉండాలని సూచించినట్లు తెలిపాడు అభిషేక్ బచ్చన్. మొత్తానికి లీలావతి హాస్పిటల్ నుంచి ఐశ్వర్య, ఆరాధ్య ఇద్దరూ డిశ్చార్జ్ కావడంతో అభిమానులు సంతోష పడుతున్నారు. అమితాబ్, అభిషేక్ కూడా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు .


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/