నిఖిల్‌తో రామ్ చరణ్ సినిమా..టైటిల్ ఏంటో తెలుసా..?

RRR తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్..కార్తికేయ 2 తో పాన్ ఇండియా స్టార్ గా మారిన నిఖిల్..వీరిద్దరి కలయికలో ఓ మూవీ రాబోతుంది. ‘ది ఇండియా హౌస్’ పేరుతో ఈ మూవీ తెరకెక్కబోతుంది. రామ్ చ‌ర‌ణ్ స‌మ‌ర్ప‌కుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాను స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు వీర్ సావ‌ర్క‌ర్ 140వ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. ఆయ‌న జీవితంలో ఓ కీల‌క‌మైన భాగాన్ని ఈ చిత్రంలో చూపించ‌బోతున్న‌ట్లు టీమ్ తెలిపింది. ఇందులో అనుప‌మ్ ఖేర్ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

రామ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వీ మెగా పిక్చ‌ర్స్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ సంస్థ‌లు క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌నున్నాయి. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లోని విక్ర‌మ్‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ వీ మెగా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశారు. 1905 సంవ‌త్స‌రంలో బ్రిట‌న్ రాజధాని లండ‌న్‌లో జరిగిన ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. స్వాతంత్య్ర ఉద్య‌మానికి ఆజ్యం పోసిన ఘ‌ట‌న‌ల స‌మాహారంగా ఈ మూవీ రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.