కొడాలినానికి బీజేపీ నేత విష్ణవర్ధన్​ రెడ్డి సవాల్

మాజీ మంత్రి , గుడివాడ వైస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కి బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి రేపు గుడివాడ బస్టాండ్ దగ్గరకు వస్తే బహిరంగ చర్చ పెడదామని కొడాలి నానికి సవాల్ చేశారు. ప్రజా చార్జిషీట్లో ఉన్న అంశాలపై చర్చకు తాము సిద్ధమంటూ పేర్కొని, మాజీ మంత్రి కొడాలి నాని వచ్చినా , లేదా కట్టకట్టుకుని వైస్సార్సీపీ నేతలందరూ వచ్చినా, తాము చర్చకు సిద్ధమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనీసం గుడివాడలోనైనా పూర్తయ్యాయని చెప్పగలరా అని ప్రశ్నించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలను గెలవబోతోందని విష్ణువర్ధన్‌రెడ్డి జోస్యం చెప్పారు. గతంలో ప్రధాని మోడీని ఓడించాలని ప్రచారం చేసిన పార్టీలు ఇప్పుడు పొత్తు కోసం వెంపర్లాడుతున్నాయని ఆయన సెటైర్లు వేశారు. ఏపీలో తాగేందుకు నీరు లేకపోయినా … మద్యం మాత్రం ఏరులై పారుతుందన్నారు. రేపు( మే19) గన్నవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుతోంది. భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ వ్యవహరించాల్సిన తీరు సహా పలు అంశాలపై కీలక చర్చ జరుగుతుందని వెల్లడించారు.