ఈడీఎఫ్‌ఈ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Modi inaugurates New Bhaupur-New Khurja section of Eastern Dedicated Freight Corridor

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఈడీఎఫ్‌సీ) లోని న్యూ భౌపూర్న్యూ ఖుర్జా విభాగాన్ని మంగళవారం ప్రారంభించారు. కారిడార్‌కు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభోత్సవం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఈడీఎఫ్‌సీలోని భౌపూర్‌ఖుర్జా భాగాన్ని రూ.5,750 కోట్లతో 351 కిలోమీటర్ల కారిడార్‌ను నిర్మించారు. కారిడార్‌ స్థానిక పరిశ్రమలకు వివిధ అవకాశాలను కల్పించబోతోంది. కొత్త ఈడీఎఫ్‌సీ విభాగం కాన్పూర్ఢిల్లీ ప్రధాన లైన్‌ను డీకంజెస్టింగ్ చేయడానికి సహాయపడుతుంది.

అంతేకాకుండా భారతీయ రైల్వేలు వేగంగా రైళ్లు నడిపేందుకు ఇది వీలు కల్పిస్తుంది. కొత్త 351 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌ నిర్మాణంతో ఔరాయ జిల్లాలోని పాడి పరిశ్రమ, పుఖ్రాయన్ జిల్లాలోని అల్యూమినియం తయారీ పరిశ్రమలు ప్రయోజనం పొందనున్నాయి. కొత్త భూపుర్‌ న్యూ ఖుర్జా విభాగం కూడా హత్రాస్‌లో హింగ్ ఉత్పత్తి, బులంద్‌ షహర్ జిల్లాలోని ఖుర్జా కుండల ఉత్పత్తులు, ఫిరోజాబాద్ గ్లాస్ వేర్ పరిశ్రమ, అలీఘర్ తాళాలు, హార్డ్‌వేర్‌ పరిశ్రమ, ఎటావా జిల్లా వస్త్ర ఉత్పత్తిదారులు, బ్లాక్ ప్రింటర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/