రేపు విరూపాక్ష ట్రైలర్ రిలీజ్

సాయి ధరమ్ తేజ్ – సంయుక్త జంటగా కార్తీక వర్మ దండు డైరెక్షన్లో సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం విరూపాక్ష . ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మేకర్స్ చిత్ర చిత్ర ప్రమోషన్ ను స్పీడ్ చేసారు. ఇప్పటికే సినిమా తాలూకా టీజర్ తో పాటు పలు సాంగ్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు అసలు సిసలైన చిత్ర ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేసారు.

రేపు ఉదయం 11: 07 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరి ఆ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. కాంతార ఫేం అంజనీశ్‌ లోక్‌నాథ్‌ విరూపాక్ష చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయిధరమ్‌ తేజ్ మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్‌ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఓ కీలక రోల్ చేస్తుండడం విశేషం. జులై 28 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.