బిగ్ బాస్ 5 : కోపంతో యానీ మాస్టర్ మీదకు పోయిన జెస్సీ..

బిగ్ బాస్ హౌస్ లో అసలైన రచ్చ మొదలైంది. మొదటి రెండు రోజులు కాస్త శాంతి శాంతిగానే ఉన్న సభ్యులు..మూడో రోజు మాత్రం ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసారు. మొదటగా పవర్ రూమ్ లోకి వెళ్ళిన విశ్వ, రవిచేత ఆడవాళ్ళ బట్టలు వేయించేలా చేసాడు. ఆ తర్వాత లోబో – సిరిల మధ్య జరిగిన గొడవ మిగతా సభ్యులను గందరగోళానికి గురి చేసింది. వారిద్దరూ ఒకరంటే ఒకరికి పడనట్టు అరుచుకుంటూ ఆ తర్వాత కలిసిపోవడం, కంటెంట్ కోసమే ఇదంతా చేస్తున్నారా అన్న అనుమానాలను అందరిలో కలిగాయి.

ఆ తర్వాత కిచెన్ డిపార్ట్ మెంట్ కోసం మాట్లాడిన కాజల్, లహరి మీద మీదకు వెళ్తున్నట్లుగా మాట్లాడుతుండడంతో కొట్టడానికి వస్తున్నట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఇదంతా కంటెంట్ కోసమేనా అంటూ లహరి కామెంట్లు చేసింది. దాంతో కాజల్ ..ఆమెకు సారీ చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. ఆమెను ఓదార్చడానికి రవి, మానస్ వచ్చారు. అటాకింగ్ మోడ్ లో మాట్లాడావని రవి తేల్చేసాడు. తర్వాత యానీ మాస్టర్ – జెస్సి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పెద్ద పెద్దగా ఆర్చుకున్నారు.

జెస్సీ ఓ కుర్చీపై కాలు వేసుకుని కూర్చోగా అక్కడికి వచ్చిన యానీ మాస్టర్‌ కుర్చీలో నుంచి కాలు తీసేయమంటే రిక్వెస్ట్ చేసింది. ఆలా ఒకటి రెండు సార్లు కాదు మూడు సార్లు రిక్వెస్ట్ చేసిన కానీ అతడు తీయలేదు. దీంతో యానీ మాస్టర్‌ కు పట్టరాని కోపం వచ్చింది. నీది నీ దగ్గర పెట్టుకో, నాటకాలు చేయకు అని వార్నింగ్ ఇచ్చింది. నీ వాయిస్‌ లేస్తే నా గొంతు లేవదా? అని నిందిస్తుండగా జెస్సీ దానికి రియాక్షన్‌గా చప్పట్లు కొట్టాడు. మిగతా సభ్యులు సైతం జెస్సి ని తప్పుపడుతూ వచ్చారు. దీంతో జెస్సి ..యానీ మాస్టర్ కు సారీ చెప్పాడు. ఈ లోపు లోబో వచ్చి జెస్సి ని అక్కడి నుండి తీసుకెళ్లాడు. మరి రేపు ఏంజరుగుతుందో చూడాలి.