ఇప్పటికైనా సస్పెండ్ చేయడం సంతోషంగా ఉందిః పొంగులేటి

ఇన్ని రోజులకు తనకు బిఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందన్న పొంగులేటి

ponguleti-srinivas-reddy-response-on-suspension-from-brs

హైదరాబాద్‌ః పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొంగులేటి మాట్లాడుతూ.. ఇన్ని రోజులకు తనకు బిఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందని చెప్పారు. బిఆర్ఎస్ నుంచి తనను ఇప్పటికైనా సస్పెండ్ చేయడం సంతోషకరమని అన్నారు. దొరల గడీ నుంచి తనకు విముక్తి లభించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు.

నిన్న కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో తన మద్దతుదారులతో పొంగులేటి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై బహిష్కరణ వేటు పడింది. చాలా కాలంగా వీరిద్దరూ బిఆర్ఎస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.