సాయి ధరమ్ తేజ్ 15 మూవీ టైటిల్ ‘విరూపాక్ష’

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన 15 వ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ఫిక్స్ చేసారు. మెగా అల్లుడు గా ఇండస్ట్రీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తేజ్..అతి తక్కువ సినిమాలతోనే మెగా అభిమానులను , సినీ లవర్స్ ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన 15 వ సినిమా తో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా..శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఏప్రిల్ 21, 2023న విడుదల కాబోతుంది.

ఈ సందర్బంగా బుధువారం టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్‌ ను రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్‌ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ‘అజ్ఞానం భయానికి మూలం.. భయం మూఢ నమ్మకానికి కారణం.. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’ అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా ఉంది. ఇక, ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి.